Madanapalle: మదనపల్లెలో మున్సిపల్ నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు ప్రశాంతంగా సాగుతోంది. వన్ టౌన్ సీఐ పర్యవేక్షణలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 18 Oct 2026 11:57 AM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో మున్సిపల్ నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మూడో రోజు కొనసాగుతోంది. ఆదివారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో మదనపల్లెలోని నామినేషన్ కేంద్రం వద్ద ప్రస్తుతం ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు కేంద్రానికి చేరుకుంటున్నారు.

మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండటంతో చివరి రోజు మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. మదనపల్లె వన్ టౌన్ సీఐ మోహన్ కుమార్ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు కొనసాగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle