Madanapalle: పెట్టుబడులతో రాయలసీమ అభివృద్ధి - మంత్రి మండిపల్లి
Madanapalle: లక్షల కోట్ల పెట్టుబడులతో రాయలసీమను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మదనపల్లెలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు హర్షణీయం.
Madanapalle: పెట్టుబడులతో రాయలసీమ అభివృద్ధి - మంత్రి మండిపల్లి
మదనపల్లె: గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి పాలనలో ఎంతో తేడా ఉందని, గత పాలకులు రాయలసీమ రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంత ప్రజల కష్టాలను తీర్చడంతో పాటు వ్యవసాయ, ఉద్యాన రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడనుందని పేర్కొన్నారు.
గతంలో కుప్పం నియోజకవర్గంలో ఇజ్రాయెల్ సాంకేతికతను ప్రవేశపెట్టి బిందు, తుంపర్ల సేద్య పరికరాలను రైతులకు రాయితీపై అందించడం ద్వారా ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రోత్సహించారని తెలిపారు. ఈ విధానాల ద్వారా తక్కువ నీటితో అధిక ఉత్పాదకత సాధించడంతో పాటు ఉద్యాన పంటల అభివృద్ధికి తోడ్పాటు అందిందన్నారు.
వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి సాగునీటి సదుపాయాలను మెరుగుపరిచే దిశగా హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను కుప్పం వరకు తీసుకురావడంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాగే అమృత్ పథకం కింద చెరువులను నింపి పట్టణ ప్రాంతాలకు కూడా నీటి వసతి కల్పించే చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టుల వల్ల రైతులు, యువత, చిన్నతరహా వ్యాపారాలు నిర్వహించే వారికి మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేస్తున్న వివిధ ప్రాజెక్టులు రానున్న సంవత్సరాల్లో ప్రాంతీయ అభివృద్ధికి మరింత దోహదపడతాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయం, మౌలిక వసతులు, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి నీటి వనరులు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రైతులకు వ్యవసాయ రంగంలో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవం, రైతుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.




