Madanapalle: పచ్చిపాల రామకృష్ణ ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక దీపోత్సవం!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె నెహ్రూ బజార్ 28వ వార్డులో కౌన్సిలర్ పచ్చిపాల రామకృష్ణ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. మున్సిపల్ చైర్మన్ చినబాబు పాల్గొన్నారు.
Madanapalle: పచ్చిపాల రామకృష్ణ ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక దీపోత్సవం!
మదనపల్లె: పట్టణంలోని నెహ్రూ బజార్ 28వ వార్డులో కార్తీక మాసం సందర్భంగా 28వ వార్డు కౌన్సిలర్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో దీపాలు వెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దీపాల వెలుగులతో నెహ్రూ బజార్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ వేడుకలకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు, మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు హాజరై భక్తులతో కలిసి దీపోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పచ్చిపాల తులసి, 23వ వార్డు కౌన్సిలర్ బోయపాటి రాణా, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, 21వ వార్డు కౌన్సిలర్ బర్నేపల్లి రవి, బీజేపీ నాయకులు శ్రీకాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.




