Madanapalle: మదనపల్లె 1, 2, 5వ వార్డుల నుంచి జనసేన అభ్యర్థుల నామినేషన్లు

Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 1, 2, 5వ వార్డుల నుంచి జనసేన అభ్యర్థులు వీరమహిళ దారం అనిత ఆధ్వర్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు సమర్పించారు.

Srinivasulu, Madanapalle
Published on: 18 Oct 2026 4:38 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె 1, 2, 5వ వార్డుల నుంచి జనసేన అభ్యర్థుల నామినేషన్లు

మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఆదివారం నామినేషన్లు దాఖలు చేశారు. రెండో వార్డు అభ్యర్థిగా వి. సుధా మహేశ్వరి, ఐదో వార్డు అభ్యర్థిగా చామంచుల మల్లిక, మొదటి వార్డు అభ్యర్థిగా పి. శివ శంకర నామినేషన్ పత్రాలను సమర్పించారు.

జనసేన పార్టీ మహిళా నాయకురాలు దారం అనిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. వార్డుల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమకు మద్దతు అందించాలని ఓటర్లను కోరారు.

అభ్యర్థుల విజయానికి జనసేన నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని, పార్టీ అభిమానులు కూడా ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉమ, నరేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle