Madanapalle: మదనపల్లె రెండో వార్డులో జనసేన కౌన్సిలర్ అభ్యర్థి ముమ్మర ప్రచారం!

Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ రెండో వార్డులో జనసేన కౌన్సిలర్ అభ్యర్థి కళావతి ఎన్నికల ప్రచారం. పాల్గొన్న సీనియర్ నాయకురాలు జయ భవ్య.

Srinivasulu, Madanapalle
Published on: 27 Oct 2026 8:28 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె రెండో వార్డులో జనసేన కౌన్సిలర్ అభ్యర్థి ముమ్మర ప్రచారం!

Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ రెండో వార్డులో జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కళావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా జనసేన అసెంబ్లీ కమిటీ సీనియర్ నాయకురాలు జయ భవ్య ప్రచారంలో పాల్గొని, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా జయ భవ్య మాట్లాడుతూ.. రెండో వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కళావతి ప్రజల ముందుకు వచ్చారని తెలిపారు. వార్డు ప్రజలు తమ అభిప్రాయాలను ఓటు ద్వారా తెలియజేయాలని, జనసేన పార్టీ అభ్యర్థి కళావతి పోటీ చేస్తున్న గాజు గ్లాసు గుర్తును గుర్తుంచుకోవాలని కోరారు. ప్రచారంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle