Madanapalle: మదనపల్లె శ్రీ సాయి హాస్పిటల్‌లో ఫైర్ సేఫ్టీ అవగాహన సదస్సు
Madanapalle: మదనపల్లె శ్రీ సాయి హాస్పిటల్‌లో ఫైర్ సేఫ్టీపై అవగాహన సదస్సు జరిగింది. డాక్టర్ శ్రీహరి సిబ్బందికి అత్యవసర జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
Madanapalle: మదనపల్లె శ్రీ సాయి హాస్పిటల్‌లో ఫైర్ సేఫ్టీ అవగాహన సదస్సు
Madanapalle: మదనపల్లె సొసైటీ కాలనీ శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో రోగులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీహరి ప్రత్యేక చొరవతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీ.డీ.ఆర్.&ఎఫ్, ఆదినారాయణ ఆధ్వర్యంలో సిబ్బందికి ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ ఆసుపత్రుల్లో రోగుల భద్రత అత్యంత ముఖ్యమని, అగ్నిప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిబ్బంది ముందస్తు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ప్రమాదం సంభవించినప్పుడు రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానంపై సిబ్బందికి అవగాహన ఉండాలని తెలిపారు.
డీ.డీ.ఆర్&ఎఫ్ ఆదినారాయణ మాట్లాడుతూ అగ్నిప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ల వినియోగం, అత్యవసర ద్వారాల ప్రాధాన్యత, విద్యుత్ పరికరాల విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో భద్రతా ప్రమాణాలను పాటించడం, సిబ్బందికి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాల ముప్పును తగ్గించవచ్చని ఈ కార్యక్రమంలో వివరించారు. కార్యక్రమంలో ప్రసాద్, జానకి, అన్వేష్, కల్పన, సాయి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.




