Madanapalle: సీబీఐ అధికారులమంటూ రియల్టర్ కిడ్నాప్.. ఆరుగురు అరెస్ట్!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీబీఐ అధికారులమంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి సాదిక్‌ను కిడ్నాప్ చేసి రూ.26 లక్షలు వసూలు చేసిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 15 Nov 2026 12:34 PM IST
Madanapalle
X

Madanapalle: సీబీఐ అధికారులమంటూ రియల్టర్ కిడ్నాప్.. ఆరుగురు అరెస్ట్!

మదనపల్లె: అన్నమయ్య జిల్లా, మదనపల్లె సీబీఐ అధికారులమంటూ నకిలీ గుర్తింపు కార్డులు, అరెస్టు వారెంట్లు చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారి సాదిక్‌ను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసిన ఆరుగురు నిందితులను మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 10న మదనపల్లెలో సాదిక్ కారును అడ్డగించి, కర్ణాటకలోని తుమకూరు జిల్లా ఫాంహౌస్‌కు తరలించారు. కేసుల నుంచి తప్పిస్తామంటూ రూ.5 కోట్లు డిమాండ్ చేసి, బంధువులు, స్నేహితుల ద్వారా రూ.26 లక్షలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో, డీఎస్పీ బి. ప్రసాద్ పర్యవేక్షణలో సీఐ ఎ. మోహన్ కుమార్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నెల 14న చీకలబైలు చెక్‌పోస్టు సమీపంలో ఆరుగురిని అరెస్టు చేసి, బాధితుడిని సురక్షితంగా విడిపించారు.

నిందితుల నుంచి రెండు నకిలీ సీబీఐ కార్డులు, డమ్మీ పిస్టల్, చేతి సంకెళ్లు, పత్రాల ఫైల్, ఇన్నోవా క్రిస్టా కారును స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి నుంచి వసూలు చేసిన రూ.26 లక్షలు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. మరో నిందితుడు రమణ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. అధికారులమంటూ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle