Madanapalle: దేశాయ్ తిప్పారెడ్డి ఆశీస్సులతో కురవంకను అభివృద్ధి చేస్తా

Madanapalle: మదనపల్లె మండలం కురవంకలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచారం. మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డితో కలసి ఎంపీటీసీ అభ్యర్థి మల్లికార్జున హామీ.

Srinivasulu, Madanapalle
Published on: 2 Nov 2026 5:55 PM IST
Madanapalle
X

Madanapalle: దేశాయ్ తిప్పారెడ్డి ఆశీస్సులతో కురవంకను అభివృద్ధి చేస్తా

మదనపల్లె: మదనపల్లె మండలం కురవంక గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. మదనపల్లె మండల జెడ్పీటీసీ అభ్యర్థి జె. కిరణ్మయి, కురవంక ఎంపీటీసీ అభ్యర్థి ఆవుల మల్లికార్జునకు మద్దతుగా నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జెడ్పీటీసీ అభ్యర్థి జె. కిరణ్మయి, ఎంపీటీసీ అభ్యర్థి ఆవుల మల్లికార్జునను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఎంపీటీసీ అభ్యర్థి ఆవుల మల్లికార్జున మాట్లాడుతూ దేశాయ్ తిప్పారెడ్డి ఆశీస్సులతో కురవంక గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పరిశీలకులు అనుష రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సి.పి రాఘవరెడ్డి, మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, బీరంగి రేవతి, కోటూరి ఈశ్వర్, చరణ్, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle