Madanapalle: మదనపల్లెలో ప్రభుత్వ ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నం!

Madanapalle: మదనపల్లెలో ప్రభుత్వ కేటాయించిన ఇంటి స్థలాన్ని పక్కనే ఉన్న వ్యక్తి కబ్జా చేయడానికి యత్నిస్తున్నాడని బాధిత దంపతులు గంగులమ్మ, నరసింహులు ఆరోపించారు.

Srinivasulu, Madanapalle
Published on: 16 Oct 2026 4:25 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో ప్రభుత్వ ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నం!

మదనపల్లె: ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాన్ని పక్కనే ఉన్న వ్యక్తి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్రంకొండ మండలం సెట్టివారిపల్లె పంచాయతీకి చెందిన టీ. గంగులమ్మ, నరసింహులు దంపతులు ఆరోపించారు. శుక్రవారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో తమ సమస్యను మీడియా దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేయాలని కోరారు.

2004లో అప్పటి ప్రభుత్వం తరఫున తమకు సర్వే నంబర్ 380 పరిధిలో నాలుగున్నర సెంట్ల ఇంటి స్థలానికి పట్టాలు మంజూరయ్యాయని, హౌసింగ్ లోన్ సాయంతో ఇల్లు నిర్మించుకున్నామని నరసింహులు తెలిపారు. ఇటీవల తహశీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించగా, సంబంధిత సర్వే నంబర్‌కు సంబంధించిన పత్రాలు అందుబాటులో లేవని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు.

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని పక్కనే ఉన్న గంగరాజు తమ స్థలంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, తమ వద్ద ఉన్న పట్టాలను పరిశీలించి స్థల హద్దులను నిర్ధారించాలని బాధిత దంపతులు విజ్ఞప్తి చేశారు. ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న ఇంటి స్థలాన్ని కాపాడి తమకు న్యాయం చేయాలని కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle