Madanapalle: రామసముద్రం మండలం వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా చంద్రకళ ఖరారు!
Madanapalle: రామసముద్రం మండలం కురిజల పంచాయతీ వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా చంద్రకళ ఖరారు. బీ-ఫామ్ అందజేత.. మండల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి.
Madanapalle: రామసముద్రం మండలం వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా చంద్రకళ ఖరారు!
Madanapalle: అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండలం కురిజల పంచాయతీకి చెందిన దొడ్డిపల్లి ఆనంద్ సతీమణి చంద్రకళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఈ క్రమంలో మంగళవారం ఆమె బీ-ఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా దొడ్డిపల్లి ఆనంద్ మాట్లాడుతూ పార్టీ తన సతీమణి చంద్రకళకు జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, రామసముద్రం మండల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజల ఆదరణతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.




