Madanapalle: సిబ్బంది లేక వెలవెలబోతున్న బర్మా రోడ్డు సచివాలయం

Madanapalle: మదనపల్లె బర్మా రోడ్డు సచివాలయం సిబ్బంది లేక ఖాళీగా దర్శనమిస్తోంది. ప్రభుత్వ సేవలు అందక అవస్థలు పడుతున్న ప్రజలు, తక్షణ స్పందన కోరుతున్న స్థానికులు.

Srinivasulu, Madanapalle
Published on: 25 Sept 2026 6:16 PM IST
Madanapalle
X

Madanapalle: సిబ్బంది లేక వెలవెలబోతున్న బర్మా రోడ్డు సచివాలయం

మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ పరిధిలోని బర్మా రోడ్డు రామారావు మున్సిపల్ స్కూల్ సమీపంలో ఉన్న సచివాలయం సిబ్బంది లేక ఖాళీగా దర్శనమిస్తోంది.

ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాల్సిన సచివాలయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

సచివాలయంలో సిబ్బంది అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle