Madanapalle: కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలి
Madanapalle: మదనపల్లెలో జరిగిన బలిజల ఆత్మీయ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు, జడ్పీటీసీ అభ్యర్థి కొప్పల రమ్య పాల్గొని మద్దతు కోరారు.
Madanapalle: కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలి
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం నిర్వహించిన బలిజల ఆత్మీయ సమావేశంలో మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు, మదనపల్లె మండల జడ్పీటీసీ అభ్యర్థి కొప్పల రమ్య పాల్గొన్నారు.
ఈ సమావేశానికి బలిజ కులస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులైన శ్రీరామ్ చినబాబు, కొప్పల రమ్యలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బలిజ కులస్తులకు విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచి విజయానికి సహకరించాలని కోరారు.
ప్రజల మద్దతుతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం, రాజంపేట పార్లమెంట్ ఎన్నికల సమన్వయ కార్యకర్త గంగారపు రామదాస్ చౌదరి, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, సీడ్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.




