Madanapalle: మదనపల్లె 42వ వార్డు కూటమి అభ్యర్థిగా బాలమాలి శేఖర్
Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 42వ వార్డు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బాలమాలి శేఖర్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలతో నామినేషన్ దాఖలు చేశారు.
Madanapalle: మదనపల్లె 42వ వార్డు కూటమి అభ్యర్థిగా బాలమాలి శేఖర్
మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో 42వ వార్డు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బాలమాలి శేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. మదనపల్లె ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ భాషా ఆదేశాల మేరకు ఈరోజు ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా బాలమాలి శేఖర్ మాట్లాడుతూ.. కూటమి నాయకుల సహకారంతో 42వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. వార్డులోని ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తన విజయానికి సహకరించాలని, 42వ వార్డు ప్రజలు తనను ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.




