Madanapalle: మదనపల్లె బాబు కాలనీలో రోడ్లపైకి వస్తున్న డ్రైనేజీ నీరు!

Madanapalle: మదనపల్లె బాబు కాలనీలో డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Srinivasulu, Madanapalle
Published on: 25 Sept 2026 5:37 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె బాబు కాలనీలో రోడ్లపైకి వస్తున్న డ్రైనేజీ నీరు!

Madanapalle: వర్షం పడిన ప్రతిసారీ మదనపల్లె బాబు కాలనీలో రోడ్లు డ్రైనేజీ నీటితో నిండిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి చేరి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందని తెలిపారు. కాలనీలో పారిశుద్ధ్య సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయని, చెత్తాచెదారం పేరుకుపోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శించారు.

కాలనీ సెక్రటరీ నేమో కాలనీ వైపు కూడా తిరిగి చూడటం లేదని వారు ఆరోపించారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని, రోడ్లపై మురుగు నీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరుగుతోందని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు బాబు కాలనీలో పర్యటించి డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle