Madanapalle: సర్వే నంబర్ మార్చి దౌర్జన్యం: మదనపల్లెలో ఉద్రిక్తత!
Madanapalle: మదనపల్లెలో ఆర్యవైశ్యుల భూమి కబ్జా యత్నంపై బాధితుల ఆరోపణ. సర్వే నంబర్ మార్చి, గేట్లు ధ్వంసం చేసి సెల్‌ఫోన్లు లాక్కున్నారని, సమగ్ర విచారణ కోరారు.
Madanapalle: సర్వే నంబర్ మార్చి దౌర్జన్యం: మదనపల్లెలో ఉద్రిక్తత!
Madanapalle: ఆర్యవైశ్యులకు సంబంధించిన స్థలంపై కొందరు కబ్జాదారులు దౌర్జన్యానికి పాల్పడి, స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపించారు. తమ భూమి సర్వే నంబర్ 303/1లో ఉందని, అయితే కబ్జాకు ప్రయత్నిస్తున్న వారు 303/2గా చెబుతున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్థలంలో ఉన్న గేట్లను ధ్వంసం చేయడంతో పాటు, తమ సెల్‌ఫోన్లను లాక్కొని భయభ్రాంతులకు గురిచేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో కంకనాల గోపాలకృష్ణ, రాజేష్ కృష్ణ, గోవర్ధన్ దాడికి పాల్పడ్డారని వారు పేర్కొన్నారు.
తమ వద్ద భూమికి సంబంధించిన పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయని, సర్వే నంబర్ విషయంలో వాస్తవాలను అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. భూమిని కబ్జా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తమ హక్కులను కాపాడుకునేందుకు పక్కా ఆధారాలు, డాక్యుమెంట్లతో చట్టపరమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరారు.




