Madanapalle: రాజ్యాంగ పరిరక్షణకు పోరాడాలి – డాక్టర్ బెల్లయ్య నాయక్!
Madanapalle: రాజ్యాంగ వ్యవస్థలు, ఓటు హక్కు పరిరక్షణకు నవంబర్ 1న ఇండియా కూటమి 'చలో ఢిల్లీ'ని విజయవంతం చేయాలని ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ బెల్లయ్య నాయక్ పిలుపు.
Madanapalle: రాజ్యాంగ పరిరక్షణకు పోరాడాలి – డాక్టర్ బెల్లయ్య నాయక్!
మదనపల్లె: మదనపల్లె దేశంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు, ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ బెల్లయ్య నాయక్ పిలుపునిచ్చారు. నవంబర్ 1న ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
బుధవారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలు అంశాలను లేవనెత్తుతున్నారని తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణ ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఇది కేవలం రాజకీయ పోరాటం కాదని, పౌరుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అబ్జర్వర్లు ఇర్ఫాన్ భాష, మల్లెల పవన్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.కే. భాష, జిల్లా ఉపాధ్యక్షులు అమీర్ భాష, ఆనంద్, రాయచోటి టౌన్ ప్రెసిడెంట్ షేక్ బావా సర్దార్ తదితరులు పాల్గొన్నారు.




