Kanipakam: కనులపండువగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు!

Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి యాలివాహన సేవ వైభవంగా జరిగింది.

VASU, PUTTALAPATTU
Published on: 30 Sept 2026 11:16 AM IST
Kanipakam
X

Kanipakam: కనులపండువగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు!

Kanipakam: శ్రీ స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి యాలివాహనం సేవను ఆలయ అధికారులు నిర్వహించారు. ముందుగా ఆలయ కళ్యాణమండపం నందు స్వామి అమ్మవార్లకు ధూప, దీప ,నైవేద్యంతో విశేష పూజలు నిర్వహించారు.

స్వామివారిని మేళ తాళాలతో పల్లకిలో తీసుకువచ్చి యాలి వాహనంపై ఆశీలను చేశారు. వేద పండితులు స్వామి వారికి పూజలు నిర్వహించి భక్తులకు హారతులు ఇచ్చారు. యాలి వాహనంపై స్వామి అమ్మవార్లు కాణిపాక పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, మరియు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఉభయదారులు, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU