Puthalapattu: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు
Puthalapattu: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పూతలపట్టులో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి సర్పంచ్ అభ్యర్థి మల్లికార్జున శెట్టి గురువారం ప్రచారం చేశారు.
Puthalapattu: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు
పూతలపట్టు: రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా పూతలపట్టు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పూతలపట్టు సర్పంచి అభ్యర్థి గా పోటీ చేస్తున్నమల్లికార్జున శెట్టి, వైఎస్ఆర్సిపి నాయకులు జగదీశ్వర్ రెడ్డి.
పూతలపట్టు పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లికార్జున శెట్టి మాట్లాడుతూ ఎన్నికలలో తనకు కేటాయించిన వంకాయి గుర్తుపై ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా పూతలపట్టు పంచాయతీ గ్రామాలందు ఇంటింటికి వెళ్లి మల్లికార్జున శెట్టి ప్రచార కార్యక్రమం నిర్వహించి తనకు ఓటు వేసి గెలిపించిన ఎడల పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
పంచాయతీలోని పరిశుద్ధ త్రాగినీరు, వీధి విద్యుత్ దీపాలు, డ్రైనేజీలు సమస్యల పైన ముఖ్యంగా దృష్టి సారించిఅన్ని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు కావున ప్రతి ఒక్కరు వంకాయ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలనికోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సిపి మేధావుల వేదిక కార్యదర్శి సభ్యులు పూతలపట్టు జగదీశ్వర్ రెడ్డి, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.




