Gudur: కర్నూలు ఎంపీని కలిసిన గూడూరు నగర పంచాయతీ చైర్‌పర్సన్

Gudur: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు చైర్‌పర్సన్ డమాం సునీతబాయి దంపతులు. పట్టణాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎంపీ హామీ.

C. Ganesh, Kodumuru
Published on: 6 Nov 2026 6:18 PM IST
Gudur
X

Gudur: కర్నూలు ఎంపీని కలిసిన గూడూరు నగర పంచాయతీ చైర్‌పర్సన్

గూడూరు: గూడూరు నగర పంచాయతీ చైర్‌పర్సన్ డమాం సునీత బాయి ఆమె భర్త డమాం సురేష్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు కి డమాం సురేష్, సునీతబాయి దంపతులు పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంపీ నాగరాజు గారు కూడా చైర్‌పర్సన్ సునీత బాయి దంపతులకు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.

ఈ సందర్భంగా గూడూరు నగర పంచాయతీ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎంపీ నాగరాజు గారిని దంపతులు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ గారు గూడూరు అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధి మనందరి బాధ్యత అని పేర్కొంటూ గూడూరు ప్రజల అభ్యున్నతికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరి, సుంకన్న, రాజేష్, బలరాం, హరి తదితరులు పాల్గొన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru