Kuppam: కుప్పం నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్ ప్రారంభం!

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 4 జడ్పీటీసీ, 56 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు.

KUMAR, KUPPAM
Published on: 5 Nov 2026 8:07 AM IST
Kuppam
X

Kuppam: కుప్పం నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్ ప్రారంభం!

Kuppam: కుప్పం నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం. నియోజకవర్గవ్యాప్తంగా 4 జడ్పీటీసీ, 56 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు. పోలింగ్ నిర్వహణకు మొత్తం 225 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,88,887 మంది ఓటర్లు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు.

ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ. కుప్పం మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు 66 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. గుడుపల్లి మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు 45 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్. శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు 57 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ.

రామకుప్పం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం. మిగిలిన రెండు ఎంపీటీసీ స్థానాలకు కొనసాగుతున్న ఎన్నికలు... రామకుప్పం మండలంలో జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు 57 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి.. ఉదయం నుంచే బారులు తీరుతున్న ఓటర్లు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారుల పర్యవేక్షణ.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM