Chittoor: గుడుపల్లె మండలంలో అత్యధికంగా 80.75 శాతం పోలింగ్!
Chittoor: కుప్పం నియోజకవర్గంలో జడ్పీటీసీ పోలింగ్ 77.46%, ఎంపీటీసీ పోలింగ్ 79.82 శాతంగా నమోదైంది. గుడుపల్లె అగ్రస్థానంలో నిలవగా, మహిళలే అధికంగా ఓటు వేశారు.
Chittoor: గుడుపల్లె మండలంలో అత్యధికంగా 80.75 శాతం పోలింగ్!
చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముగిసిన జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్. నియోజకవర్గవ్యాప్తంగా 1,88,887 మంది ఓటర్లకు గాను 1,46,306 మంది ఓటు హక్కు వినియోగం. మొత్తంగా 77.46 శాతం పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో 72,745 మంది పురుషులు.. 73,560 మంది మహిళలు. ఒకరు ఇతర ఓటరు కూడా ఓటు వేసినట్లు తుది నివేదికలో వెల్లడి. మండలాల వారీగా పోలింగ్ శాతాల్లో గుడుపల్లె అగ్రస్థానం.
గుడుపల్లె మండలంలో 80.75 శాతం పోలింగ్ నమోదు. శాంతిపురం మండలంలో 80.50 శాతం పోలింగ్ నమోదు. కుప్పం మండలంలో 79.48 శాతం పోలింగ్ నమోదు. రామకుప్పం మండలంలో అత్యల్పంగా 69.27 శాతం పోలింగ్ నమోదు. జడ్పీటీసీ ఎన్నికల తుది పోలింగ్ గణాంకాలు వెల్లడించిన ఎన్నికల అధికారులు. ఎంపీటీసీ ఎన్నికలు.. 79.82 శాతం పోలింగ్ నమోదు. కుప్పం నియోజకవర్గంలో ముగిసిన ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.
నాలుగు మండలాల పరిధిలో 79.82 శాతం ఓటింగ్ నమోదు. మొత్తం 1,47,638 మంది ఓటర్లకు గాను 1,17,842 మంది ఓటు హక్కు వినియోగం. ఓటు వేసిన వారిలో 58,592 మంది పురుషులు.. 59,249 మంది మహిళలు. ఒకరు ఇతర ఓటరు కూడా ఓటు హక్కు వినియోగం. మండలాల వారీగా పోలింగ్ శాతాల్లో గుడుపల్లెకు అగ్రస్థానం. గుడుపల్లె మండలంలో 35,539 మంది ఓటర్లకు గాను 28,697 మంది ఓటు హక్కు వినియోగం.
గుడుపల్లెలో అత్యధికంగా 80.75 శాతం పోలింగ్ నమోదు. శాంతిపురం మండలంలో 48,350 మంది ఓటర్లకు గాను 38,921 మంది ఓటింగ్. శాంతిపురంలో 80.50 శాతం పోలింగ్ నమోదు. కుప్పం మండలంలో 58,363 మంది ఓటర్లకు గాను 46,384 మంది ఓటు హక్కు వినియోగం. కుప్పం మండలంలో 79.48 శాతం పోలింగ్ నమోదు.
రామకుప్పం మండలంలో 5,386 మంది ఓటర్లకు గాను 3,840 మంది ఓటింగ్. రామకుప్పం మండలంలో అత్యల్పంగా 71.30 శాతం పోలింగ్ నమోదు. ఎంపీటీసీ ఎన్నికల తుది పోలింగ్ గణాంకాలను వెల్లడించిన ఎన్నికల అధికారులు. మొత్తంగా జడ్పీటీసీ ఎన్నికల్లో 77.46 శాతం.. ఎంపీటీసీ ఎన్నికల్లో 79.82 శాతం పోలింగ్ నమోదు.




