Boyakonda: శ్రీ బోయకొండ గంగమ్మను దర్శించుకున్న కర్ణాటక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు!
Boyakonda: అన్నమయ్య జిల్లా పుంగనూరులోని ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మను కర్ణాటక యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.ఎస్. మంజునాథ్ దర్శించుకున్నారు.
Boyakonda: శ్రీ బోయకొండ గంగమ్మను దర్శించుకున్న కర్ణాటక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు!
Boyakonda: ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ను కర్ణాటక రాష్ట్రం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ ఎస్ మంజునాథ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటిసారి అమ్మవారిని నా స్నేహితులు లక్ష్మణ రాజు దయానందరాజు రెడ్డి ప్రసాద్ లతో కలిసి దర్శించుకున్నానని ఆలయ పరిసర ప్రాంతాలు మంచి వాతావరణంలో ఆలయం ఉందని తెలిపారు.
బోయకొండ పరిసర ప్రాంతాలు చాలా అందమైన ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయి. అమ్మవారి దర్శనానికి కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారని తెలిసిందన్నారు.
కర్ణాటక రాష్ట్రం నుండి తరలివచ్చే భక్తులకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ప్రస్తావించగా ఆలయం తరఫున ఒక మెమరాండం అందిస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ రాయల్ ఉమాపతి అనిల్ తదితరులు పాల్గొన్నారు.




