Chittoor: కాణిపాకం వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు - కల్పవృక్ష వాహనంపై దర్శనం!

Chittoor: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చిన సిద్ధి, బుద్ధి సమేత స్వామి.

VASU, PUTTALAPATTU
Published on: 1 Oct 2026 10:09 AM IST
Chittoor
X

Chittoor: కాణిపాకం వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు - కల్పవృక్ష వాహనంపై దర్శనం!

Chittoor: కల్పవృక్షవాహనముపై భక్తులకు దర్శనమిచ్చిన సిద్ధి, బుద్ధి, వినాయక స్వామి. భక్తుల కోరిన కోర్కెలను తీర్చేది కల్ప వృక్ష వాహనం.

ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది అందరూ కలిసి అత్యంత వైభవముగా కల్పవృక్ష వాహన సేవను నిర్వహిస్తారు.

బ్రహ్మాండనాయకుడు వినాయక స్వామి మూల విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణ మండపము నందు ఉత్సవమూర్తులకు పసుపు, కుంకుమ, గంధము, సుగంధ ద్రవ్యాలతో కలిశాల క్షీరాభిషేకం తో విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో తీసుకువచ్చి అత్యంత వైభవముగా విద్యుత్ దీపాలంకరణ విదేశీ సుగంధ పుష్పాలతో అలంకరించిన కల్ప వృక్ష వాహనాలపై ఆసీనులను చేసి పూజలు నిర్వహించి భక్తులకు హారతులు ఇచ్చారు.

పురాణాలలో చెప్పినట్టుగా కల్పవృక్ష వాహనంపై ఉన్న బంగారు కాంతులతో సుందరముగా భక్తులను కటాచించేందుకే వచ్చినట్టుగా ఉన్నా స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తరించాలని ఆలయ వేద పండితులు తెలిపారు. కల్పవృక్ష వివాహనపై ఉన్న స్వామి వారిని భక్తులు దర్శించుకుని మొక్కుబడును తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ.వో. పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మణి నాయుడు, ఆలయ అర్చకులు, వేద పండితులు ,bఆలయ అధికారులు , సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU