Kanipakam: కాణిపాకంలో వైభవంగా విమానోత్సవం - తరలివచ్చిన భక్తులు!

Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా విమానోత్సవం. విమాన వాహనంపై పురవీధుల్లో విహరించిన స్వామివారు.

VASU, PUTTALAPATTU
Published on: 27 Sept 2026 8:12 AM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకంలో వైభవంగా విమానోత్సవం - తరలివచ్చిన భక్తులు!

Kanipakam: కాణిపా వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 21 రోజులు అత్యంత వైభవముగా ఆలయ అధికారులు, ఉభయ దారులు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా శనివారం రాత్రి సిద్ది బుద్ధి సమేత వినాయక స్వామి విమానా వాహనంపై వివరిస్తూ భక్తులకు దర్శనమిచ్చే దృశ్యం ఒక్క కాణిపాక పుణ్యక్షేత్రముమాత్రమే జరుగుతుంది.

స్వామివారిని ఆలయములోని కళ్యాణ మండపం వద్ద విశేష పూజలు నిర్వహించి అనంతరం పల్లకిలో తీసుకువచ్చి విమాన వాహనంపై ఆశీనులను చేసి, పూజలు నిర్వహించి భక్తులకు కర్పూర హారతులు ఇచ్చారు.

కాణిపాక బ్రహ్మోత్సవాలలో విమానోత్సవం ఒక ప్రత్యేకత చాటుకుంది ఎందుకంటే స్వామివారు బ్రహ్మోత్సవాలలో అలసి పోవటం వలన స్వామివారు సిద్ధి బుద్ధి సమేతుడై విమానోత్సవంలో కాణిపాక పురవీధులలో ఆహ్లాదకరంగా విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. విమాన వాహనములో విహరిస్తున్న స్వామి వారిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈ.వో .పెంచల కిషోర్ ,ఆలయ చైర్మన్ మనీ నాయుడు, అర్చకులు, ఉదయదారులు ,భక్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU