Kanipakam: అల్పిసి పౌర్ణమి వేళ కాణిపాకంలో చిలుక వాహన సేవ!
Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో అల్పిసి పౌర్ణమి సందర్భంగా శ్రీ సిద్ధి, బుద్ధి సమేత స్వామివారికి ఊంజల్ సేవ, చిలుక వాహన గ్రామోత్సవం వైభవంగా జరిగాయి.
Kanipakam: అల్పిసి పౌర్ణమి వేళ కాణిపాకంలో చిలుక వాహన సేవ!
కాణిపాకం: శ్రీ స్వామి వారి దేవస్థానం ప్రధాన దేవాలయం నందు ఈరోజు అల్పిసి పౌర్ణమి సందర్భంగా సాయంత్రం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి స్వామివారికి ఊంజల్ సేవ మరియు వైభవంగా చిలుక వాహనంపై గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా కీ||శే||సల్లా సుబ్బారాయుడు శెట్టి వారి కుమారులు కాణిపాకం వాస్తవ్యులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.




