Kanipakam: కాణిపాకం వినాయకుడి హుండీ ఆదాయం ₹2.33 కోట్లు

Kanipakam: కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో గత 26 రోజులకు గాను హుండీ లెక్కింపు ద్వారా ₹2,33,34,358 ఆదాయం లభించింది.

VASU, PUTTALAPATTU
Published on: 6 Oct 2026 8:09 PM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకం వినాయకుడి హుండీ ఆదాయం ₹2.33 కోట్లు

కాణిపాకం: శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకస్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 26 రోజులకు -2,33,34,358/- రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో వెంచర్ కిషోర్ మంగళవారం తెలియజేశారు, బంగారం -41.గ్రాములు, వెండి , 1కిలో 105 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా - 21,495/- రూపాయలు.

నిత్య అన్నదానం హుండీ ద్వారా - 1,59,461/- రూపాయలు. భిక్షండి హుండీ ద్వారా - 23,215, ఫారిన్ కరెన్సీ యూఎస్ఏ -206. డాలర్స్ యూఏఈ155. డ్రమ్స్ ఆస్ట్రేలియా-20. డాలర్స్, కెనడా - 25. డాలర్స్. ఇంగ్లాండ్- 45. పౌండ్స్. మలేషియా- 52 రింగ్ ఇట్స్, ఇ రో-110. ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ తెలిపారు.

ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నవారు, దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, వసంత, రాజ్యలక్ష్మి, అనసూయ, డిప్యూటీ ఈ.వో సాగర్ బాబు, చిత్తూరు అసిస్టెంట్ కమిషన్ చిట్టెమ్మ, ఏఈఓలు -ప్రసాద్, రవీంద్రబాబు, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు - కోదండపాణి, శ్రీధర్ బాబు, దివాకర్ రెడ్డి, నాగేశ్వరరావు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ, సేవకులు, తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU