Kanipakam: కాణిపాకంలో కామధేను వాహన సేవ.. స్వామికి పట్టువస్త్రాలు సమర్పణ
Kanipakam: కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో కామధేను వాహన సేవ సందర్భంగా సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారికి నాయి బ్రాహ్మణులు పట్టువస్త్రాల సారె సమర్పించారు.
Kanipakam: కాణిపాకంలో కామధేను వాహన సేవ.. స్వామికి పట్టువస్త్రాలు సమర్పణ
Kanipakam: కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కామదేను వాహన సేవ పురస్కరించుకుని సిద్ది బుద్ది సమేత స్వామివారికి నాయి బ్రాహ్మణులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
స్వామివారి కల్యాణ కట్టనుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా స్వామివారికి రకరకాల పండ్లు ,పూలతో, పట్టు వస్త్రాల సారెను నాయి బ్రాహ్మణులు స్వామి వారికి సమర్పించారు.
వివిధ రకరకాల మంగళ వాయిద్యాలతో ఆనందముతో, ఉత్సాహంతో, వాయిద్య విన్యాసాలతో స్వామివారిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచారు.
ఇతర రాష్ట్రాల నుండి కూడా నాయి బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు.
ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ అధికారులు,అర్చకులు, మాజీ సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, నాయి బ్రాహ్మణ ఉభయ దారులు తదితరులు పాల్గొన్నారు.




