Kanipakam: కాణిపాకంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాల వేద సభ

Kanipakam: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చతుర్వేద పారాయణంతో వేద సభ, వేద పండితులకు ఘన సత్కారం నిర్వహించారు.

VASU, PUTTALAPATTU
Published on: 24 Sept 2026 9:01 PM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాల వేద సభ

Kanipakam: శ్రీ స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు వేద సభ (వేద సదస్యము)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోని వివిధ ప్రముఖ దేవాలయాల నుండి వచ్చిన వేద పండితులచ్చే ఉదయం నుంచి సాయంత్రం వరకు చతుర్వేద పారాయణం, చతుర్వేద స్వస్తి, మరియు వేద ప్రశస్తి, గురించి ప్రముఖ వేదభాష్య పండితులచే ఉపన్యాసం తరువాత వేద పండితులకు సత్కార కార్యక్రమము నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ . చైర్మన్ మణి నాయుడు, బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU