Kanipakam: కాణిపాకం మణికంఠేశ్వర స్వామి ఆలయంలో దుర్గాదేవిగా మరగధాంబిక దర్శనం

Kanipakam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ మణికంఠేశ్వర ఆలయంలో మరగధాంబిక అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

VASU, PUTTALAPATTU
Published on: 19 Oct 2026 7:24 PM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకం మణికంఠేశ్వర స్వామి ఆలయంలో దుర్గాదేవిగా మరగధాంబిక దర్శనం

కాణిపాకం: శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం నందు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో మరగధాంబిక అమ్మవారు దర్శనం ఇచ్చారు.

ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన మరియు పూజలు నిర్వహించారు. దుర్గాదేవి అలంకరణతో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు ఆలయ అర్చకులు భక్తులకు తీర్చ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, మరియు వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU