Chittoor: చంద్రప్రభ వాహనంపై విహరించిన కాణిపాకం వినాయకుడు!
Chittoor: కాణిపాకం బ్రహ్మోత్సవాలలో సోమవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. తరలివచ్చిన భక్తులు. పూర్తి వివరాలు ఇక్కడ.
Chittoor: చంద్రప్రభ వాహనంపై విహరించిన కాణిపాకం వినాయకుడు!
Chittoor: శ్రీ స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి చంద్రప్రభ వాహనం సేవ పై దర్శనం ఇచ్చిన దేవాది దేవుడు విజ్ఞవినాయకుడు.
కాణిపాకం ప్రత్యేక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకం, చందన అలంకారము తో విశేష పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు . స్వామి అమ్మవార్లను పల్లకిలో తీసుకువచ్చి చంద్రప్రభ వాహనంపై ఆశీనులన చేసి కాణిపాక పురవీధులలో విహరింప చేశారు.
చంద్రప్రభ వాహనంపై కోటి కాంతుల వెలుగుతో ఉన్న స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటే సకల పాపాలు పోయి అన్ని శుభాలే జరుగుతాయి అని ఆలయ వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, మరియు ఈ.ఓ, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఉభయదారులు, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




