Kanipakam: కాణిపాకంలో 1111 కలశాలతో క్షీరాభిషేకం: బలిజ వంశస్తులు
Kanipakam: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోనుగుంట బలిజ వంశస్తులు 1,111 కలశాలతో ఊరేగింపుగా వచ్చి క్షీరాభిషేకం చేశారు.
Kanipakam: కాణిపాకంలో 1111 కలశాలతో క్షీరాభిషేకం: బలిజ వంశస్తులు
కాణిపాకం: చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంల వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం బొమ్మసముద్రం, తిరువనంపల్లె, కారకంపల్లి గ్రామాలకు చెందిన గోనుగుంట బలిజ వంశస్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం ఆయా గ్రామాల నుంచి సుమారు 1111 కలశాలతో భక్తిశ్రద్ధలతో భారీ ఊరేగింపుగా కాణిపాకం ఆలయానికి చేరుకున్నారు. స్వామివారికి పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో గోనుగుంట బలిజ వంశస్థులు, వారి బంధుమిత్రులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




