Chittoor: చిత్తూరులో ఘనంగా డీకే ఆదికేశవులునాయుడు, సత్యప్రభ జయంతి వేడుకలు!

Chittoor: చిత్తూరులో మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు, మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ జయంతి వేడుకలను వారి కుమార్తె తేజేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Chandra Sekhar, Chittoor
Published on: 21 Sept 2026 5:10 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరులో ఘనంగా డీకే ఆదికేశవులునాయుడు, సత్యప్రభ జయంతి వేడుకలు!

Chittoor: మాజీ ఎంపీ, టిటిడి మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులునాయుడు, మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ జయంతి వేడుకలను ఆమె కుమార్తె తేజేశ్వరి ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. స్థానిక మురుకంబట్టు వద్దనున్న ఆదికేశవులునాయుడు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

అక్కడే సత్యప్రభ చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కట్టమంచిలోని శాంతా రఘురామన్ కళ్యాణ మండపంలో తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులకు కల్పిస్తున్న ఉచిత భోజన, వసతి సౌకర్యాలను పరిశీలించారు. సోమవారం ఒక రోజు అన్నదానం కోసం అయ్యే ఖర్చును ఆమె వితరణ చేశారు. అనంతరం వారి నివాసంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తేజేశ్వరి మాట్లాడుతూ చిత్తూరు అభివృద్ధి కోసం తమ తల్లిదండ్రులు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. వివిధ గ్రామాలలోని ప్రజలకు సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా తాగునీరు సరఫరా చేశారని గుర్తు చేశారు. చిత్తూరు నగరంలో రహదారుల అభివృద్ధికి తొలి అడుగు వేసిన ఘనత సత్యప్రభకే దక్కుతుందన్నారు. తిరుమల వెళ్ళే భక్తులకు తమ తల్లిదండ్రులు అన్నదానం చేసేవారని పేర్కొన్నారు. వారు భౌతికంగా లేకున్నా.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని అభివర్ణించారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor