Thamballapalle: తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై దాడి దురదృష్టకరం!

Thamballapalle: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో జనసేన పార్టీ కార్యాలయంపై దాడిని మదనపల్లె జనసేన నేత జంగాల శివరాం రాయల్ తీవ్రంగా ఖండించారు.

Srinivasulu, Madanapalle
Published on: 23 Oct 2026 8:52 AM IST
Thamballapalle
X

Thamballapalle: తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై దాడి దురదృష్టకరం!

Thamballapalle: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, వాహనాలను నాశనం చేయడం, జనసేన, టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడటాన్ని మదనపల్లె జనసేన నాయకుడు జంగాల శివరాం రాయల్ తీవ్రంగా ఖండించారు. కర్రలు, ఇనుప ముళ్లు ఉన్న ఆయుధాలతో దాడులు చేయడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జంగాల శివరాం మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ శ్రేణులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రాజకీయ విభేదాలను హింసాత్మక చర్యల ద్వారా పరిష్కరించుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.

ఈ ఘటనపై పోలీసు శాఖ తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ చేపట్టి, దాడులకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఘటనను పరిశీలించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

రాజకీయ పార్టీల కార్యాలయాలు, కార్యకర్తలు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత అని పేర్కొంటూ, ఇలాంటి దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని జంగాల శివరాం పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle