Madanapalle: జనసేన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం - ఘన సన్మానం!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం.

Srinivasulu, Madanapalle
Published on: 1 Oct 2026 11:43 AM IST
Madanapalle
X

Madanapalle: జనసేన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం - ఘన సన్మానం!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని మిషన్ కాంపౌండ్ ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేటర్, రాజోలు జనసేన శాసనసభ్యులు దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతం, నాయకులు-కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సిరివేలు చరణ్ ఆధ్వర్యంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌కు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లైఫ్ కేర్ రాజశేఖర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిరివేలు చరణ్, లైఫ్ కేర్ రాజశేఖర్, చంద్రశేఖర్ (చంటి), సుబ్బు, సునీల్, తో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle