Madanapalle: మదనపల్లె 44వ వార్డులో జనసేన అభ్యర్థి బండి భారతి విస్తృత ప్రచారం!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ 44వ వార్డులో జనసేన కౌన్సిలర్ అభ్యర్థి బండి భారతి విస్తృత ప్రచారం. భర్త బండి మనోహర్‌తో కలసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన.

Srinivasulu, Madanapalle
Published on: 26 Oct 2026 1:57 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె 44వ వార్డులో జనసేన అభ్యర్థి బండి భారతి విస్తృత ప్రచారం!

Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 44వ వార్డులో జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బండి భారతి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బండి మనోహర్ సతీమణి అయిన బండి భారతి వార్డులోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా బండి మనోహర్ మాట్లాడుతూ, 44వ వార్డు అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. వార్డు ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జనసేన పార్టీ అభ్యర్థి బండి భారతికి ప్రజలు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle