Madanapalle: మదనపల్లె 14వ వార్డులో జనసేన జయకేతనం.. దీపిక ఘనవిజయం!

Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 14వ వార్డులో జనసేన అభ్యర్థి శ్రీరామ లక్ష్మీ దీపిక 221 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.

Srinivasulu, Madanapalle
Published on: 3 Nov 2026 8:56 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె 14వ వార్డులో జనసేన జయకేతనం.. దీపిక ఘనవిజయం!

మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో 14వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి శ్రీరామ లక్ష్మీ దీపిక 221 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన 14వ వార్డు ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వార్డు అభివృద్ధికి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని శ్రీరామ లక్ష్మీ దీపిక అన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle