Madanapalle: మదనపల్లెలో జనసేనకు 6 వార్డులు: జయ భవ్య హర్షం

Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ 6 వార్డుల్లో విజయం సాధించింది. అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు జనసేన నాయకురాలు జయ భవ్య కృతజ్ఞతలు తెలిపారు.

Srinivasulu, Madanapalle
Published on: 3 Nov 2026 8:42 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో జనసేనకు 6 వార్డులు: జయ భవ్య హర్షం

మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఆరు వార్డుల్లో విజయం సాధించిన నేపథ్యంలో జనసేన నాయకురాలు జయ భవ్య హర్షం వ్యక్తం చేశారు. జనసేన అభ్యర్థులను గెలిపించిన ఆరు వార్డుల ప్రజలకు, ఓటర్లకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

విజయం సాధించిన జనసేన పార్టీ అభ్యర్థులు:

1. 2వ వార్డు – తమ్మిశెట్టి కళావతి

2. 5వ వార్డు – చామంచుల మల్లిక

3. 9వ వార్డు – కోలకాల సుజాత

4. 14వ వార్డు – శ్రీరామ లక్ష్మీ దీపిక

5. 42వ వార్డు – గాయత్రి

6. 44వ వార్డు – బండి భారతి

ఈ సందర్భంగా జయ భవ్య మాట్లాడుతూ.. జనసేన పార్టీపై నమ్మకంతో అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క ఓటరుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని గౌరవిస్తూ, వార్డుల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి విజేతలైన కౌన్సిలర్లు కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల సహకారంతో వార్డుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle