Chittoor: చిత్తూరు 34వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థిగా మహమ్మద్ ఆరిఫ్ నామినేషన్!
Chittoor: చిత్తూరు నగరపాలక సంస్థ 34వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థిగా మహమ్మద్ ఆరిఫ్ నామినేషన్ దాఖలు చేశారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.
Chittoor: చిత్తూరు 34వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థిగా మహమ్మద్ ఆరిఫ్ నామినేషన్!
Chittoor: చిత్తూరు నగరం లోని స్థానిక లాలూ గార్డెన్, అశోక్ పురం 34వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా మహమ్మద్ ఆరిఫ్ శనివారం నాగయ్య కళాక్షేత్రం సమీపంలో గల లాలు గార్డెన్ స్వర్ణ సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపకులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలను నెరవేర్చే చర్యలో భాగంగా తాను జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం జరుగుతోందని అందులో భాగంగానే 34వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. తనకు జనసేన పార్టీ అభ్యర్థిగా 34 డివిజన్ లో పోటీ చేయడానికి అవకాశం కల్పించిన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.




