Chittoor: చిత్తూరులో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్!
Chittoor: చిత్తూరు జిల్లా కల్లూరులో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.90 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం.
Chittoor: చిత్తూరులో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్!
Chittoor: 5 మంది అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు.నిందితుల నుంచి సుమారు రూ.90 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఇందులో 314 గ్రాముల బంగారం,20 కిలోల వెండి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కల్లూరు మండలంలోని పుంగనూరు రోడ్డులో ఉన్న శ్రీకృష్ణ జువెలర్స్‌లో జూలై 17న చోరీ చేసి దుకాణం తాళాలు పగలగొట్టి అందులోని బంగారం, వెండి అపహరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.క్లూస్ టీమ్ సహకారంతో సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితులను గుర్తించారు.సెప్టెంబర్ 19న సాయంత్రం 4 గంటల సమయంలో నిందితులను అరెస్టు చేశారుఈ కేసులో A1 దినేష్, A2 బాలయ్య చిరంజీవి, A3 జగన్, A4 వసంత్ కుమార్, A5 సిలంబరసన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్‌కు తరలించారు. నేరస్తులను పట్టుకోవడానికి కృషి చేసిన కల్లూరు సీఐ,ఎస్ఐ మరియు క్లూస్ టీం సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.




