Madanapalle: కురువంక సర్పంచ్ అభ్యర్థి పార్వతమ్మ జోరుగా ప్రచారం
Madanapalle: మదనపల్లె మండలం కురువంక గ్రామ పంచాయతీ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి పార్వతమ్మ ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. మౌలిక సదుపాయాలపై హామీ.
Madanapalle: కురువంక సర్పంచ్ అభ్యర్థి పార్వతమ్మ జోరుగా ప్రచారం
మదనపల్లె: మదనపల్లె మండలం కురువంక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి పార్వతమ్మ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి సతీమణి అయిన పార్వతమ్మ గ్రామంలోని వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో గతంలో గ్రామాభివృద్ధికి కృషి చేశామని, అదే స్ఫూర్తితో తన సతీమణి పార్వతమ్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారని తెలిపారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమకు మద్దతు ఇచ్చి పార్వతమ్మను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.




