gurramkonda: గుర్రంకొండ ఎస్సైపై విమర్శలు: ప్రైవేట్ విధులు!
gurramkonda: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ఎస్సై రవీంద్ర ప్రైవేట్ వ్యక్తులతో పోలీస్ విధులు నిర్వహింపజేయడంపై వివాదం. సమగ్ర విచారణకు స్థానికుల డిమాండ్.
gurramkonda: గుర్రంకొండ ఎస్సైపై విమర్శలు: ప్రైవేట్ విధులు!
gurramkonda: గుర్రంకొండ ఎస్సై రవీంద్ర స్థానిక దళారులను వెంటబెట్టుకొని తిరుగుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.లాఠీతో గుర్తుతెలియని యువకుడి దౌర్జన్యం: ఎటువంటి అధికారిక హోదా లేని అనామక యువకుడు లాఠీ పట్టుకుని అటుగా రాకపోకలు సాగించే సాధారణ ప్రజలపై రుబాబు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు.
పోలీస్ జీపు నడుపుతున్న ప్రైవేట్ వ్యక్తి: నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ వాహనాన్ని (జీపు) సంబంధం లేని ప్రైవేట్ యువకుడు నడపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పోలీస్ విధుల్లో కళాశాల విద్యార్థులు: చదువుకోవాల్సిన కళాశాల విద్యార్థులు తరగతులు వదిలేసి నామినేషన్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు విధులు నిర్వహించడం గమనార్హం.
శాంతిభద్రతలపై ఆందోళన: నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ వ్యవహారాలపై స్థానిక ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




