Guduru: గూడూరు ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్
Guduru: గూడూరు నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తుకు ఆదేశం.
Guduru: గూడూరు ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్
గూడూరు: కర్నూలు జిల్లాలో రేపు జరగనున్న గూడూరు నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో, సోమవారం కౌంటింగ్ కేంద్రాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, విధుల్లో ఉన్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈకార్యక్రమంలో కోడుమూరు సీఐ తబ్రేజ్, గూడూరు ఎస్ఐ రాజకుళాయప్ప తదితరులు పాల్గొన్నారు.




