Chittoor: కాణిపాకంలో వైభవంగా వినాయక స్వామి పుష్ప పల్లకి సేవ!
Chittoor: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా జరిగిన పుష్ప పల్లకి సేవ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
Chittoor: కాణిపాకంలో వైభవంగా వినాయక స్వామి పుష్ప పల్లకి సేవ!
Chittoor: శ్రీ స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి పుష్పపల్లకి సేవపై సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారు కాణిపాకం పురవీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు.
స్వామి వారికి చందన అలంకారం చేసి పంచామృత అభిషేకలు నిర్వహించి, విశేష పూజలతో స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి విదేశీ సుగంధ పుష్పాలతో అలంకరించిన పుష్ప పల్లకిపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి, పూజలు నిర్వహించి భక్తులకు ఆలయ అర్చకులు హారతులు ఇచ్చారు.
పుష్ప పల్లకిలో ఊరేగుతున్న వినాయక స్వామిని దర్శించుకుంటే సకల కష్టాలు తొలగిపోయి, మంచి జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారి పుష్ప పల్లకి సేవలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, మరియు ఈ.ఓ, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఉభయదారులు, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




