Kanipakam: కాణిపాకంలో అంగరంగ వైభవంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణం!
Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కన్నుల పండువగా జరిగిన తిరుకళ్యాణ మహోత్సవం.
Kanipakam: కాణిపాకంలో అంగరంగ వైభవంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణం!
Kanipakam: చిత్తూరు జిల్లా శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారంరాత్రి తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఆగమ శాస్త్ర ప్రకారం శాస్త్రోత్తంగా ఆలయ అధికారుల నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవానికి కావలసిన సారే,పట్టు వస్త్రాలు మొదలుకొని అన్ని వరదరాజ స్వామి దగ్గర నుండి రావడం ఆనవాయితీ.
స్వామివారి తిరు కళ్యాణ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఉపాసన కార్యక్రమం నిర్వహించి,అర్చక స్వాములే కళ్యాణ ప్రతినిధులుగా పాల్గొని అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి సిద్ధి బుద్ధి సమేతముగా జరిగే కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి సాక్షాత్తు దేవ లోకము నుండి దేవతలు అందరూ పాల్గొని స్వామి అమ్మవార్లను ఆశీర్వదించుతారని పురాణాలలో తెలుపబడింది.
స్వామివారి దివ్య కళ్యాణం మహోత్సవంలో పాల్గొనే అదృష్టం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. స్వయంభుగా వెలసిన కాణిపాక పుణ్యక్షేత్రంలో జరుగు స్వామి వారి కళ్యాణం తిలకించిన వారికి అన్ని శుభాలే జరుగుతాయని భక్తుల నమ్మకం, ప్రధానంగా కళ్యాణోత్సవ కార్యక్రమంలో సంతానము లేని దంపతులు, వివాహం కాలేని వారు,తదితర శుభాలు జరగాలని భక్తులందరూ పాల్గొంటారు. తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ శ్రీ మణి నాయుడు,ఈ.వో శ్రీ పెంచల కిషోర దంపతులు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు వసంత, కృష్ణవేణి, శ్రీవాణి కల్యాణోత్సవ ఉభయదారులు, తదితరులు పాల్గొన్నారు.




