Madanapalle: మదనపల్లె-పుంగనూరు మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం!

Madanapalle: మదనపల్లె వలసపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. టమాటో బొలెరోను ఢీకొట్టిన లారీ, యువకుడు అక్కడికక్కడే మృతి.

Srinivasulu, Madanapalle
Published on: 19 Sept 2026 9:17 AM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె-పుంగనూరు మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం!

Madanapalle: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం, వలసపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ములకలచెరువు మండలం కాల్వపల్లికి చెందిన ముజీబ్ (24), ఇమ్రాన్ (30) టమోటాలు అన్‌లోడ్ చేసి బొలెరోలో మదనపల్లె వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ అతివేగంతో ఢీకొట్టింది. ముజీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని మెరుగైన చికిత్సకు తరలించారు. లారీ డ్రైవర్ తాలూకా పోలీసుల అదుపులో ఉన్నాడు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle