Punganur: పుంగనూరులో నకిలీ లోన్ దందా: మహిళా సంఘాలకు టోపీ
Punganur: పుంగనూరు కేంద్రంగా ₹10 వేలు కడితే లక్ష లోన్ ఇస్తామంటూ మహిళా సంఘాల నుంచి లక్షల్లో నగదు వసూలు చేసి మైక్రో ఫైనాన్స్ ముఠా బోర్డు తిప్పేసింది.
Punganur: పుంగనూరులో నకిలీ లోన్ దందా: మహిళా సంఘాలకు టోపీ
Punganur: 10 వేలు కడితే లక్ష లోన్ అంటూ వసూళ్లు. పుంగనూరు కేంద్రంగా మహిళా సంఘాల నుంచి భారీగా నగదు సేకరణ.. మైక్రోఫైనాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు మహిళల ఆరోపణ.
పది మంది సభ్యులు గల గ్రూప్లో ఒక్కొక్కరు 1,000 కడితే లక్ష లోన్ అంటూ నమ్మించినట్లు వెల్లడి. 10 వేలు చెల్లించినా నెల రోజులుగా రుణం ఇవ్వలేదని బాధితుల ఆవేదన..
‘ఈ రోజు.. రేపు’ అంటూ తిప్పుకుంటున్నారని మహిళల ఆరోపణ.. ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకాలు, ఫొటోలు, ఇతర ధ్రువపత్రాల సేకరణ.. డబ్బులు వసూలు చేసిన వ్యక్తుల ఫోన్లు స్విచ్ఛాఫ్..
పలు మండలాల్లోనూ ఇదే తరహాలో వసూళ్లు జరిగినట్లు బాధితుల ఆరోపణ.. మహిళా సంఘాలలోని మహిళలే టార్గెట్ గా వసూళ్ళు.
మండల మహిళ సమైక్య లోని పనిచేస్తున్న అధికారులు సిబ్బందికి తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అని పలు అనుమానాలు పుంగనూరు, సోమల, సదుం మండల మహిళ సమైక్యలలో పరిస్థితి ఏమిటో?
పీలేరులో ఇదే తరహా మోసం.. బోర్డ్ తిప్పేసిన మైక్రో ఫైనాన్స్ కంపెనీ.




