Puthalapattu: పుత్రమద్దిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫున డాక్టర్ సునీల్ ప్రచారం

Puthalapattu: పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఐరాల మండలం పుత్రమద్దిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం చేశారు.

VASU, PUTTALAPATTU
Published on: 2 Nov 2026 4:01 PM IST
Puthalapattu
X

Puthalapattu: పుత్రమద్దిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫున డాక్టర్ సునీల్ ప్రచారం

పూతలపట్టు: పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం ఎం పై పల్లి సెగ్మెంట్ పుత్ర మద్ది గ్రామ పంచాయతీ నందు వైఎస్ఆర్సిపి పార్టీ ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులకు ఓటు వేయాలని గడపగడప తిరిగి ప్రచారం నిర్వహించిన సునీల్ కుమార్. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వములో చేసిన అభివృద్ధి పథకాలు నేటికీ గ్రామాలందు కనబడుతుందని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు నాయకులు తెలుగుదేశం పార్టీ వచ్చిన రెండున్నర సంవత్సరముల కాలంలోనే గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పడం ఎంతవరకు సమంజసం అని తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నించారు. వైసిపి పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్స్ వేసే దానికి వెళ్ళినప్పుడు నామినేషన్ పత్రాలను చించివేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేశారని సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలు నేటికీ ప్రజల హృదయాలలో నిలిచిపోయిందని తెలిపారు. జరగబోవు స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐరాల మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ బుజ్జి రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి పద్మ , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU