Punganur: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను గెలిపించాలి

Punganur: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.

MAHESH, PUNGANOOR
Published on: 12 Oct 2026 6:15 PM IST
Punganur
X

Punganur: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను గెలిపించాలి

పుంగనూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

సోమవారం పుంగనూరు పట్టణంలో నిర్వహించిన వివిధ వార్డుల స్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లలో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన తెలిపారు. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని, వార్డులవారీగా ప్రజలతో మమేకమై పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పెద్దిరెడ్డి సూచించారు.

ప్రజలు గత ఐదేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను గుర్తించి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. కౌన్సిల్‌ ఏర్పాటైన మూడు నెలల్లోగా పట్టణంలో ఎక్కడైనా నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మాజీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీ భాష, కొండవీటి నాగభూషణం, శ్రీనాథ్ రెడ్డి, అనూష రెడ్డి, వెంకట్ రెడ్డి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR