Chittoor: చిత్తూరు జడ్పీ చైర్‌పర్సన్‌గా శైలజా తేజమూర్తి!

Chittoor: చిత్తూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్న పూతలపట్టు జడ్పీటీసీ శైలజా తేజమూర్తి. ఏకగ్రీవ ఎన్నికపై హర్షం వ్యక్తం చేసిన పార్టీల నాయకులు, విద్యావేత్తలు.

VASU, PUTTALAPATTU
Published on: 29 Oct 2026 8:13 AM IST
Chittoor
X

Chittoor: చిత్తూరు జడ్పీ చైర్‌పర్సన్‌గా శైలజా తేజమూర్తి!

Chittoor: ప్రముఖ విద్యాసంస్థల విజయం విద్యా సంస్థ అధినేత తేజ మూర్తి శ్రీమతి శైలజ తేజ మూర్తి పూతలపట్టు జడ్పిటిసి గా రాజకీయాలలో అరంగేట్రం చేసి మహిళ లోకానికి ఆదర్శంగా నిలిచారు.

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పెద్దల ఆశీర్వాదంతో శైలజ తేజ మూర్తి పూతలపట్టు జడ్పిటిసిగా ఎన్నికల బరిలో నిలిచి అందరి ఆమోదంతో ఏకగ్రీవముగా ఎన్నికై చిత్తూరు జడ్పీ చైర్మన్గా పదవి చేపట్టనున్న సందర్భముగా అన్ని రాజకీయ పార్టీల మహిళలు హర్షం వెలుబుచ్చారు.

ఉన్నత విద్యను అభ్యసించి గణిత శాస్త్రంలో డాక్టరేట్ బిరుదు పొందిన శైలజ మూర్తి విద్య రంగంలోనే గాక, రాజకీయ రంగంలో కూడా ప్రవేశించడంతో పలువురు రాజకీయ విశ్లేషకులు ఆమెకు అభినందనలు తెలిపారు.

ప్రతిసారి జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహిస్తున్నారంటే పడమటిమండలాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చారు రాజకీయ నాయకులు.

జడ్పీ పదవి అంటే కుల సమీకరణలు గొప్పగా ఉండాలి డబ్బు రాజకీయ పలుకుబడి గొప్పగా ఉండి రాజకీయ నాయకుల దృష్టిలో నిరంతరం తలలో నాలుక లా ఉండాలి.

తూర్పు మండలాలలో కుల బలం రాజకీయ బలము డబ్బు ఆర్భాటాలు ఉన్న ఇంతవరకు జడ్పీ చైర్మన్ పదవి అలంకరించ లేకపోయారు. శైలజ తేజ మూర్తి జడ్పీ చైర్మన్గా పదవి అలంకరించి జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేయాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అంచల అంచలగా ఎదిగిన విజయం విద్యాసంస్థల అధినేత తేజ మూర్తి ,శైలజ తేజ మూర్తి రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేకుండా తమ విద్యాసంస్థలను నడుపుకుంటూ, పేద విద్యార్థులకు తన వంతు సహాయముగా విద్యాదానం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేశారు.

ఎన్నో రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో నాయకులతో కూడా ఎవరితో ఎక్కడ విభేదం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర మంచి విద్యాసంస్థలు నడుపుతున్నారని గొప్ప పేరు తెచ్చుకున్నారు.

చదువుకున్న విద్యావంతులకు నిరుద్యోగ సమస్య లేకుండా తన విద్యాసంస్థలందు లెక్చరర్ గాను ప్రొఫెసర్ల గాను ఉద్యోగాలు కల్పించి ఆదుకున్నారు.

తమ విద్యా సంస్థల గుర్తింపు చిత్తూరు జిల్లా నలుమూలల వ్యాపింప చేశారు. విజయం కాలేజ్ అంటే విద్యార్థులు విజయంతోనే తిరిగి వస్తారని తల్లిదండ్రులకు గట్టి నమ్మకం కల్పించారు.

విద్యా విధానంలో గోరంత స్థాయి నుంచి మొదలుపెట్టి కొండంత స్థాయి వరకు ఎదిగి విద్యా వ్యవస్థలోని గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తేజు మూర్తి, శైలజ మూర్తి ఇప్పటికీ ఎప్పటికీ సామాన్య వ్యక్తులగా కనిపిస్తారు.

తల్లిదండ్రులు గౌరవిస్తేనే సమాజంలో అన్ని విధాలుగా ఎదుగుతారని పెద్దలు చెప్పినట్లు తేజ మూర్తి పెద్దలను గౌరవించి ప్రతి ఒక్కరి దగ్గర మంచివాడు అనిపించుకున్నారు.

శైలజ తేజ మూర్తి నిరంతరం విద్యార్థుల విద్య పట్ల అత్యంత శ్రద్ధవహించి విజయం విద్యాసంస్థల అభివృద్ధికి ఎంతగానో దోహద పడ్డారు.

శైలజ తేజ మూర్తికి రాజకీయాలు కొత్తయినా పూతలపట్టు మండలానికి సంబంధించిన ఆడపడుచుగా జడ్పీ చైర్పర్సన్ పదవి చేపట్టనున్న సందర్భంగా పార్టీలకు అతీతంగా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU