Chittoor: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ!

Chittoor: మంచం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గుడిపాల మండలం చీలాపల్లి సర్పంచ్ అభ్యర్థి నాగినేని రాజేశ్వరి ఇంటింటి ప్రచారంలో ఓటర్లను కోరారు.

Chandra Sekhar, Chittoor
Published on: 29 Nov 2026 4:49 PM IST
Chittoor
X

Chittoor: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ!

Chittoor: మంచం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని గుడిపాల మండలం చీలా పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నాగినేని రాజేశ్వరి ఓటర్లను అభ్యర్థించారు. ఆదివారం పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఓటర్లను కలిసి కరపత్రాలు పంపిణీ చేస్తూ మంచం గుర్తుపై ఓటు వేసి తనకు మద్దతు తెలపాలని కోరారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తోడుగా నిలిచి పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ప్రజలు ఒక్క అవకాశం కల్పించి మంచం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor